లైగర్ మూవీ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?

లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరూ ధర్నాలు చేశారు. మమ్మల్ని కాపాడాలి అంటూ రోడ్డు మీదకు వచ్చారు..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక పూరి గత చిత్రమైన లైగర్ భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. మరి ఆ సినిమా ప్రభావం ఇప్పుడు ఈ సినిమా మీద పడుతుంది అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు అంటే లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరూ ధర్నాలు చేశారు. మమ్మల్ని కాపాడాలి అంటూ రోడ్డు మీదకు వచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాని తీసుకోవడానికి కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయితే వాళ్లు చాలావరకు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక సినిమా యూనిట్ నుంచి అయితే వాళ్లకు ఎలాంటి సహాయం అందదు.

కాబట్టి ఈ సినిమాను తీసుకుంటే ప్రాఫిట్ వస్తుందా లేదా అనే ఉద్దేశ్యం తోనే కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ వెనుక ముందు ఆలోచిస్తున్నారట. మరి ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ తన మార్క్ చూపిస్తూ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని అందరూ మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ కూడా పూరి జగన్నాథ్ కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ రాని ఏరియాల్లో తనే ఓన్ గా రిలీజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారట. ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.