పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా ఆస్తుల విలువ తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లలో అద్భుతమైన విజయం సాధించడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటే ఈమె కనిపిస్తుంది. దానితో ఈమె గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు నెటిజన్లు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా రాజకీయాల ద్వారా ప్రజల్లో నిత్యం కనిపిస్తున్నారు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఈయన హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నాడు. అయితే ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదనేది తెలిసిందే. చాలా తక్కువ రోజుల్లోనే పవన్ కి తన మొదటి భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక పవన్ ఆ తర్వాత సినీ నటి రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు బద్రి సినిమాలో నటించి హిట్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్యలో ప్రేమ పుట్టిందట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా సమయంలో వీరి ప్రేమ మరింత ముదిరింది. దానితో వీరిద్దరూ కలిసి ఒకటయ్యారు. ఈ జంటకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట కూడా దూరం అయింది. వీరిద్దరు విడిపోయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ , అన్నా లేజ్నేవా అనే విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అయితే అన్నా లెజ్నేవా రష్యాకు చెందిన ఈమె ఒక మోడల్, నటి. తీన్మార్ సినిమా సమయంలో ఈమె పవన్ ను కలిశారట. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో వీరు కూడా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఈమెకు దాదాపు 1800 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని టాక్. దీని గురించి అధికారిక ప్రకటన లేకున్నా ఆమె ఆస్తుల విలువ హై రేంజ్ లోనే ఉంటుందని తెలుస్తోంది.
CALENDER - 07-10-2025 06:33:32 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|