ఈవీఎంల ట్యాంపరింగ్ ఈసీ.. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం)లను ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉందని పిట్రోడా తెలిపారు. దీంతో ఫలితాలను తారుమారు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు..

Sam Pitroda: ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాక్ అవుతున్నాయని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీటిని వాడొద్దని సూచించారు. మస్క్ చేసిన ఈ వ్యాఖలు భారత్‌లో ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హ్యాకింగ్‌కు అవకాశం..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం)లను ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉందని పిట్రోడా తెలిపారు. దీంతో ఫలితాలను తారుమారు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా కీలక పోస్టులు చేశాడు.
ట్వీట్ ఇలా..
‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్, కాంప్లెక్స్ సిస్టం రంగాల మీద సుమారు అరవై ఏళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది. దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి‘ అని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
CALENDER - 07-10-2025 08:35:47 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|