తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. తర్వలో ఖాతాల్లో రూ.2,500.. కండీషన్స్ అప్లై!
Telangana: మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు..

Telangana: ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2,500 చొప్పున త్వరలో జమ చేస్తామని ప్రకటించారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు.
హామీల అమలుపై దృష్టి..
విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే కేబినెట్ భేటీలో కొన్ని పథకాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
CALENDER - 07-10-2025 08:45:00 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|