వైసీపీకి షాక్.. విడదల రజిని ఫోన్ స్విచ్ ఆఫ్
తాజా మాజీ మంత్రి విడదల రజిని సైతం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది..

Vidadala Rajini: వైసీపీకి వరుసగా షాక్ లు తప్పడం లేదు. మున్ముందు మరింత కష్టాలు తప్పేలా లేవు. గత ఐదు సంవత్సరాలుగా వివిధ కారణాలతో పార్టీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఓటమితో వెనుదిరుగుతున్నారు. పార్టీని వీడుతున్నారు. ఫలితాలు వెలువడిన ఈ రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘవరావు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజా మాజీ మంత్రి విడదల రజిని సైతం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది.ఆమె ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
CALENDER - 07-10-2025 08:35:49 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|