WI vs AFG : వరల్డ్ కప్ లో ఒకేరోజు రెండు అద్భుతాలు
WI vs AFG : న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గు సన్ సరికొత్త రికార్డు సృష్టిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగో ఓవర్ వేసిన అజ్మతుల్లా ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు..

WI vs AFG : అమెరికా – వెస్టిండీస్ వేదికల మధ్య జరుగుతున్న టి20 వరల్డ్ కప్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. వాటికి కొనసాగింపుగా సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్ లలో అద్భుతాలు జరిగాయి. పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూ సన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా నాలుగు మెయిడెన్ ఓవర్లు వేసి, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఫ్గనిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒకే ఓవర్ లో 36 పరుగులు ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.
వారెవా ఫెర్గూసన్
కివీస్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూ సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పపువా న్యూ గినియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో బంతితో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా, మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టి20 క్రికెట్లో అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. టి20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సొంతం చేసుకోలేదు.
న్యూ గినియా ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదో ఓవర్లో ఫెర్గూ సన్ బంతి అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతులను నిప్పులు చెరిగే విధంగా వేశాడు. ఏడవ ఓవర్లో మరోసారి బౌలింగ్ అందుకొని అదే విధంగా మెయిడిన్ చేశాడు. ఆ తర్వాత 12 ఓవర్ లో బౌలింగ్ వేసి.. రెండో బంతికి వికెట్ పడగొట్టాడు. మూడో ఓవర్ కూడా మెయిడిన్ చేశాడు. 14 ఓవర్ లో రెండవ బంతికి మరో వికెట్ పడగొట్టి.. మరోసారి మెయిడిన్ చేశాడు..
CALENDER - 07-10-2025 08:35:49 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|